స్టాక్ మార్కెట్..సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్ టాప్ గెయినర్స్, లూజర్స్

స్టాక్ మార్కెట్..సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్ టాప్ గెయినర్స్, లూజర్స్

స్టాక్ మార్కెట్ సోమవారం (నవంబర్ 11) మందకొడిగా సాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 9.83 పాయింట్లు లాభపడి 79వేల 486 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 6.9 పాయింట్లు నష్టపోయి 24వేల 148 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభంనుంచి సెన్సెక్స్ 80వేల 102 నుంచి 79వేల 001 రేంజ్ లో హెచ్చుతగ్గులను చూసింది. చివరికి 0.01 శాతం లాభపడి 79వేల 486 వద్ద ముగిసింది. 

నిఫ్టీ ఇండెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా  లాభపడిన కంపెనీల్లో ఉన్నాయి. అయితే  టాప్ లూజర్లుగా ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఆయిల్  అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఉన్నాయి. 

అదేవిధంగా సెన్సెక్స్ ఇండెక్స్ లో టాప్ గెయినర్లుగా  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ , టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. టాప్ లూజర్స్ గా  ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, NTPCలు ఉన్నాయి. 

ALSO READ | Gold Price: హమ్మయ్య.. బంగారం ధర మళ్లీ భారీగా తగ్గిందిగా.. ఇలానే తగ్గొచ్చుగా..!

నిఫ్టీ:

టాప్ గెయినర్లు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.28శాతం), ట్రెంట్ (2.89శాతం), ఇన్ఫోసిస్ (1.65శాతం), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.62శాతం), టెక్ మహీంద్రా (1.36శాతం).

టాప్ లూజర్స్: ఏషియన్ పెయింట్స్ (8.17శాతం డౌన్), బ్రిటానియా ఇండస్ట్రీస్ (5.44శాతండౌన్), అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ (3.58శాతం డౌన్), సిప్లా (2.50శాతం తగ్గుదల), ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (2.15శాతం తగ్గుదల).

సెన్సెక్స్:

టాప్ గెయినర్లు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.22శాతం), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.60శాతం), ఇన్ఫోసిస్ (1.58శాతం), టెక్ మహీంద్రా (1.24శాతం), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (1.21శాతం).

టాప్ లూజర్స్: ఏషియన్ పెయింట్స్ (8.18శాతం డౌన్), టాటా స్టీల్ (1.76శాతం డౌన్), బజాజ్ ఫైనాన్స్ (1.73శాతం డౌన్), మహీంద్రా అండ్ మహీంద్రా (1.65శాతం డౌన్), NTPC (1.32% శాతం).