- రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలె
- కామారెడ్డి సభలో రాహుల్‌గాంధీ
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఈ సారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదివారం కామారెడ్డిలోని గవర్నమెంట్డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. తెలంగాణలో ఈ సారి దొరల అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఈ పోరులో అంతిమ విజయం ప్రజలదేనన్నారు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కామారెడ్డికి రావడం వెనుక దాగి ఉన్న కుట్రను గమనించాలని కోరారు. ఇక్కడి విలువైన భూములపై కేసీఆర్ కన్ను పడిందని, వాటిని దోచుకోడానికే వస్తున్నారన్నారు. 40 ఏండ్లుగా రాజకీయంలో ఉన్న కేసీఆర్‌కు ఇయ్యాల అమ్మమ్మ ఊరు కోనాపూర్ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, ఇక్కడి ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తోందన్నారు.
కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించేందుకే అధిష్టానం తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశించిందన్నారు. కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. సభలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, మాణిక్‌రావు ఠాక్రే, అర్బన్అభ్యర్థి షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అభ్యర్థులు మదన్మోహన్రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ ఇందుప్రియ, టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు, లీడర్లు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, గొనే శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సభ సక్సెస్‌తో శ్రేణుల్లో జోష్
కామారెడ్డిలో రాహుల్సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నిండింది. కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా గ్రామాలు, టౌన్ల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వివరించారు.