- యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఫైటింగ్
- హైకమాండ్ పరిశీలనలో జానారెడ్డి ప్రధాన అనుచరుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి
- ఇప్పటికే అండెం సంజీవరెడ్డి పేరును ప్రతిపాదించిన ఎంపీ వెంకటరెడ్డి
- వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థి ఎంపికకు అవకాశం
నల్గొండ, వెలుగు : యాదాద్రి జిల్లా కాంగ్రెస్అధ్యక్ష పదవి కోసం పార్టీ అగ్రనేతల నడుమ ఫైటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుంభం అనిల్‌రెడ్డి పార్టీ వదిలివెళ్లడంతో ఆ స్థానాన్ని తమ అనుచరులతో భర్తీ చేయాలని చూస్తున్నారు.
మాజీ మంత్రి కె. జానారెడ్డి తన ప్రధాన అనుచరుడైన భువనగిరికి చెందిన ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. ఎంపీ కోమటి రెడ్డి గుండాల మండలానికి చెందిన అండెం సంజీవరెడ్డిని డీసీసీ ప్రెసిడెంట్ చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే వీళ్ల పేర్లను హైమాండ్‌కు పంపించారు. కానీ, హైకమాండ్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
జానారెడ్డి పంతం నెగ్గేనా?
వచ్చే ఎన్నికల్లో యాదాద్రి జిల్లాలో పార్టీ గట్టెక్కాలంటే ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తినే ప్రెసిడెంట్ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కసిరెడ్డి నారాయాణ రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్‌గా చేసేందుకు జానారెడ్డి తెరవెనుక గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
కుభం మాదిరిగా ఆయన కూడా మోటాటి రెడ్డి వర్గానికి చెందిన వారు కూవడంతో ఈక్వెషన్స్ కూడా కుదురుతాయని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే పలు దఫాలు చర్చలు కూడా జరిగినట్లు తెలిసింది. డీసీసీ పదవితో పాటు ఎంపీగా నిలబడే అవకాశం కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీలో ముప్పై ఏండ్లుగా పనిచేస్తున్న కసిరెడ్డి 2006 నుంచి 2011 వరకు జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కలిసి వస్తుందని భావిస్తున్నారు. అప్పుడు కూడా జానారెడ్డి సపోర్ట్ జడ్పీ చైర్మన్ అయ్యారు.
చింతల వెనకడుగు వేసినట్లేనా..?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన చింతల వెంకటేశ్వరెడ్డి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. భువనగిరి అసెంబ్లీ స్థానం పైన ఆశలు పెట్టుకున్న వెంకటేశ్వరెడ్డికి అనిల్ రెడ్డి వెళ్లిపోవడంతో ఛాన్స్ దొరికింది.
కాంగ్రెస్‌లో వచ్చేందుకు సిద్ధమైన ఆయన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు తెలిసింది. భువనగిరిలో పోటీకి అవకాశం ఇస్తే పార్టీలోకి వస్తానని చెప్పినట్లు సమాచారం. కానీ ఎమ్మెల్యే టికెట్విషయం లో తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని ఉత్తమ్ తేల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో వెంకటేశ్వరెడ్డి చేరికకు బ్రేక్‌పడినట్లు అనిపిస్తోంది.
సంజీవరెడ్డికి ఇవ్వాలంటున్న కోమటి రెడ్డి
గుండాల మండలానికి చెందిన అండెం సంజీవరెడ్డిని డీసీసీ ప్రెసిడెంట్ చేసేందుకు ఎంపీ కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన పేరును ఇప్పటికే హైకమాండ్‌కు పంపించారు. ఈసారి ఆలేరు నియోజ కవర్గానికే డీసీసీ పదవి ఇవ్వాలని అక్కడి నేతలు పట్టుబడుతున్నారు.
దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు సీట్లు బీసీలకు ఇచ్చి, పార్టీ పదవి రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వడం ద్వారా ఈక్వేషన్స్కుదురుతాయని వెంకటరెడ్డి పార్టీ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంపీ సెగ్మెంట్లో గుటాటి రెడ్ల ఓట్లు ఎక్కువగా ఉండడంతో అదే వర్గానికి చెంది న సంజీవరెడ్డిని ప్రెసిడెంట్‌ను తనకు, తన ఫ్యామిలీకి ఎదురుండదని భావిస్తున్నట్లు టాక్ ఉంది.