ఏపీలో బాలీవుడ్ నటిపై కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నిల ప్రమేయం ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కేసులో వీరి ప్రమేయం ఎంత మేరకు ఉందనే విషయంపై సీఎంఓ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్ర ఏ మేరకు ఉందన్న వ్యవహారంపై వివరాలు కోరిందని సమాచారం.
కాంతి రాణా, విశాల్ గున్నిలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ముంబైలో నమోదైన కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు ఏపీ పోలీసులు. ఐపీఎస్ అధికారులే ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వటంపై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలోనే.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, మాజీ సలహాదారు సజ్జల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న ఐపీఎస్ అధికారులు బాలీవుడ్ నటిని, ఆమె కుటుంబంపై కేసు పెట్టి వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read:-ఎక్స్ బ్రేక్ డౌన్.. ఫొటోలు అప్ లోడ్ కావటం లేదూ..!
ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, సజ్జలపై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బాలివుడ్ నటిని వైసీపీ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో విచారణ పోలీసులే చేశారా.. లేక సజ్జల చేశారా... సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని, విచారణలో చాలా విషయాలు బయటపడే అవకాశం ఉందని అన్నారు వర్ల రామయ్య.