- సైబర్ వాలంటీర్లు, కమాండోలను నియమించాలి
- కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ సుందరి నందా
- 5 రాష్ట్రాల ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్
- సైబర్ నేరాలను నివారించాలి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంపై దాఖలైన పిల్‌ను ఈ నెల 19న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్స్‌లోని బాత్రూమ్స్, టాయిలెట్స్, దిండ్లు, పరుపులు వంటివి విద్యార్థులకు సరిపడా ఉన్నాయో.. లేవో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్నిమాపక యంత్రాలు, వార్డెన్ల సంఖ్య వంటి వివరాలపై కూడా రిపోర్టు ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ హాస్టల్స్‌లో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్–2018 నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా వసతుల్లేవంటూ దాఖలైన పిల్‌ను శుక్రవారం బెంచ్ విచారించింది.
ALSO READ: పేపర్ 1 ఈజీ.. పేపర్ 2 టఫ్ .. టెట్‌కు భారీగాహాజరైన అభ్యర్థులు
గైడ్‌లైన్స్ మేరకు సదుపాయాల్లేవు
గైడ్‌లైన్స్ మేరకు సౌలత్లు కల్పించడం లేదని, పది మందికి ఒక బాత్‌రూమ్, ఏడుగురికి ఒక టాయిలెట్, 50 మందికో వార్డెన్ ఉండాలని గైడ్‌లైన్స్ నిర్దేశిస్తున్నా.. ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. పలు రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. స్టూడెంట్స్‌కు ఇస్తున్న భోజనం కూడా సరిగ్గా లేదని, దీంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దేవరుప్పుల, మోర్తాడ్, మన్ననూర్‌లోని స్కూల్స్‌లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 300 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారన్నారు. దాదాపు 15 మంది అమ్మాయిలు ఐసీయూలో ఉన్నారని వివరించారు.