Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్.. ఆ మూడు క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు

Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్.. ఆ మూడు క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు

నాలుగేళ్ళకొకసారి జరిగే విశ్వ క్రీడలకు రంగం సిద్ధమైంది. జూలై 26 నుండి పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడల్లో భారత్ దేశం తరుపున ఈ సారి 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరి జాబితాను భార‌త ఒలింపిక్ సంఘం బుధవారం(జులై 17) రిలీజ్ చేసింది. ఎప్పటిలాగే ఈ సారి మన భారత ఆటగాళ్లు దేశానికి మెడల్ తీసుకొని రావడానికి ఆరాటపడుతున్నారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ భారతీయులకు కల. ఈ సారి స్వర్ణ పతాకాన్ని గెలిచేందుకు  మన దేశం తరపున ఎవరు రేస్ లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

హాకీ:
 
ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా హాకీ జట్టుది ఘన చరిత్ర. ఎనిమిది గోల్డ్ సహా 12 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక విజయవంతమైన జట్టుగా నిలిచింది. 1928లో ఆమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌డామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదలైన స్వర్ణయాత్రను 1980 వరకు కొనసాగించింది. మధ్యలో ఓ సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు బ్రాంజ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా లభించాయి. కానీ, కాల క్రమేనా మన హాకీ వీరుల ఆట అనూహ్యంగా దిగజారింది. 

ALSO READ | Paris 2024 Olympics: విశ్వ క్రీడలకు 117 మంది భారత అథ్లెట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

1984 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 2016  రియో గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకూ ప్రతీసారి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చిన హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం అద్భుతం చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ బ్రాంజ్ అందుకుంది. సెమీఫైనల్లో ఓడినా మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బలమైన జర్మనీని ఓడించి ఔరా అనిపించింది. దాంతో పారిస్‌‌ మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియా పతకం ఆశిస్తున్న ఆటల్లో హాకీ కూడా ఉంది. అంచనాలకు తగ్గ ఆటతీరు కొనసాగిస్తే హాకీలో మనకు గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉంది. 

నీరజ్ చోప్రా:

అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా ఈ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా మరో మెడల్ తెస్తాడని ఆశిస్తున్న వారిలో నీరజ్ చోప్రా ముందున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్ తర్వాత కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. 26 ఏండ్ల  చోప్రా 2022  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గోల్డ్ సాధించి పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్ నెగ్గిన జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీరుడు గతేడాది గోల్డ్ సాధించాడు. వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా  కైవసం చేసుకున్నాడు. 

2020 టోక్యోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హిస్టరీ క్రియేట్ చేయడం దేశ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. చోప్రా వరుసగా రెండోసారి బంగారు పతకం నెగ్గాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకోగా.. అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో పతకం వస్తుందని ఇండియా ఆశిస్తోంది. అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకం ఇక కలే అనుకుంటున్న సమయంలో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఏకంగా గోల్డ్ మెడల్ నెగ్గడంతో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సువర్ణాధ్యాయం మొదలైంది. 

ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బంగారు పతకం తెచ్చిన దేశ తొలి క్రీడాకారుడిగా నీరజ్ చరిత్రకెక్కగా.. పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన పరుగు వీరులపై ఆశలు పెరిగాయి. నీరజ్ చోప్రా మరోసారి పసిడి అందుకుంటాడని దేశం భావిస్తుంది.  

పీవీ సింధు:
    
తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు సార్లు ఇండియాకు మెడల్స్ అందించిన సింధు.. ఈ సారి బంగారు పతకం గెలుచుకునే అవకాశం ఉంది. తన తొలి ఒలింపిక్స్‌లోనే అద్భుతాలు చేసింది. రియో 2016 ఒలింపిక్స్‌లో సింధు సంచలన ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక్కడ స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడి స్వర్ణాన్ని కోల్పోయింది. తొలి సెట్ గెలిచి ఆశలు రేకెత్తించినా ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో పరాజయం పాలైంది.  

ALSO READ | ఆశల అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. మరో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నీరజ్ గురి

ఓడినా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. టోక్యో 2020లో సింధు మరో పతాకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గోల్డ్ మెడల్ మిస్ అయినా కాంస్య పతకం గెలిచింది. అయితే ఈ సారి కూడా స్వర్ణం రాలేదు. కాంస్య పతకంతో రెండు వేర్వేరు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణి (సుశీల్ కుమార్ తర్వాత – 2008, 2012)గా నిలిచింది. ఇప్పుడు ఆమె పారిస్‌లో 3వ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంటే.. మూడు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన తొలి భారతీయురాలు అవుతుంది. గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాలని సింధు కోరుకుంటుంది.