కోయంబత్తూరు: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఫైనల్ రౌండ్ తొలి రోజు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు డబుల్ పోడియం సాధించింది. శనివారం కరీ మోటార్ స్పీడ్వేపై జరిగిన ఫార్ములా–4 ఇండియన్ ఓపెన్, ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ఫైనల్ తొలి రౌండ్ రేసుల్లో బ్లాక్‌బర్డ్స్ రేసర్లు అఖిల్ అలీభాయ్, నీల్ జానీ తొలి, రెండో స్థానాల్లో నిలిచారు.
ఫార్ములా–4 ఇండియన్ ఓపెన్ రేసును అఖిల్ అలీభాయ్ (సౌతాఫ్రికా) 26 ని. 14.474 సెకన్లలో పూర్తి చేశాడు. ఇండియన్ రేసర్ రుహాన్ అల్వా (శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్) 26 ని. 15.614 సెకన్లతో రెండో ప్లేస్‌ను సాధించాడు. చెన్నై టర్బో రైడర్స్ జట్టు డ్రైవర్ హాడీ నోహ్ మిమాస్సీ (26:17.254సె) మూడో స్థానంలో నిలిచాడు. ఐఆర్ఎల్ ఫైనల్ రౌండ్లో సోహిల్ షా (గోవా ఏసెస్, 26 ని.34.598 సెకన్లు), నీల్ జానీ (బ్లాక్‌బర్డ్స్, 26 ని. 51.574 సెకన్లు), జోన్ లాంకాస్టర్ (చెన్నై టర్బో, 26 ని. 54.548 సెకన్లు) టాప్–3లో నిలిచారు. ఆదివారం ఫైనల్ రౌండ్ రెండో రేసుతో ఈ పోటీలు ముగుస్తాయి.