ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మేల్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో దూసుకుపోతోంది. మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ4 కు పోటీగా జెమినీ AI ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం వర్షన్ దాని ఎంపిక చేసిన కంపెనీలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్ గతేడాది చాట్ జీపీటీ AI ని సృష్టించగా, ఈ సంవత్సరం గూగుల్ తన ఉత్సాదక ఏఐ లో తన పెట్టుబడులను వెచ్చించి జెమినీ AI ఆవిష్కరించింది. ఇది ఇప్పుడు టెక్ ప్రపంచంలో జెమినీ AI తుఫాన్ గా మారింది.
గూగుల్ సృష్టించిన జెమినీ AI.. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న చాట్ జీపీటీ 4 కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. 2024 నాటికి జెమినీ AI, చాట్ జీపీటీ కంటే 20 రెట్లు శక్తివంతం అవుతుందని అంచనా వేస్తున్నారు .
చాట్‌బాట్‌లు, టెక్స్ట్ సారాంశం, ఇమెయిల్ డ్రాఫ్ట్‌లు, మ్యూజిక్ లిరిక్స్, వార్తా కథనాలు, కస్టమర్ కోరినట్లు ఆధారంగా కోడింగ్, చిత్రాలను రూపొందించడంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సాయపడే వివిధ అప్లికేషన్లకు శక్తినిచ్చే బిగ్ లాంగ్వేజ్ మోడల్స్ జెమిని ఏఐ కలిగి ఉంది.
ఈ మేరకు AWS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ.. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అంతరిక్ష-సాంకేతిక పురోగతికి సహాయం చేయడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce)తో వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అంతరిక్ష కంపెనీలు, పరిశోధనా సంస్థలు, విద్యార్థులకు అత్యాధునిక క్లౌడ్ టెక్నాలజీకి ప్రాప్యతను అందిస్తుంది, కొత్త అంతరిక్ష పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
Google భారతదేశం, జపాన్‌లోని కస్టమర్లకు శోధన సాధనంలో ఉత్పాదక AIని ప్రవేశపెట్టింది. కస్టమర్ ఇచ్చే కంటెంట్ ఆధారంగా ప్రశ్నలకు టెక్స్ట్ లేదా ఫొటోలను అందిస్తుంది. అదనంగా AI -ఆధారిత సాధనాలను ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లకు $30 చొప్పున నెలవారీ ఖర్చుతో అందుబాటులో ఉంచింది.