బోర్డ్ ఎగ్జామ్స్ లో టాపర్ అయినోళ్లు విమానం ఎక్కొచ్చు!

బోర్డ్ ఎగ్జామ్స్ లో టాపర్ అయినోళ్లు విమానం ఎక్కొచ్చు!

బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ సాధిస్తే ‘ఫోన్, సైకిల్, బైక్ కొనిస్తాం. అడిగింది చేసి పెడతాం’ అని తల్లిదండ్రులు హామీలిస్తుంటారు. స్కూల్లోనూ సన్మానాలు, కొంత డబ్బు ఇస్తుంటారు. అంతేకానీ, సొంత ఖర్చు పెట్టుకొని విమానాల్లో నచ్చిన చోటుకి తిప్పడం లాంటివి చేయరు. కానీ, ఈ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం చేశాడు. స్టూడెంట్స్ లైఫ్ లో మర్చిపోలేని ఆఫర్ ఇచ్చి, దాన్ని నెరవేర్చాడు.

పంజాబ్, ఫిరోజ్ పూర్ జిల్లాలోని షాహీద్ గురుదాస్ రామ్ మెమోరియల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్న రాకేశ్ శర్మ, స్టూడెంట్స్ చదువులో పాఠశాల వెనుకబడి ఉండటాన్ని గమనించాడు. వాళ్లలో పోటీతత్వం నింపి, చదువులో పైకి తీసుకురావాలని ఫ్రీ విమాణ ప్రయాణం ఆఫర్ ప్రకటించాడు. బోర్డ్ ఎగ్జామ్స్ లో తన స్కూల్ పిల్లలు ఎవరు టాపర్ అయినా విమానంలో నచ్చిన చోటుకి తిప్పుతానని హామీ ఇచ్చాడు. తన మాటలతో స్పూర్తి పొందిన నలుగురు స్టూడెంట్స్ కష్టపడి చదివి మెరిట్ లో ర్యాంక్ సాధించారు. దీంతో ప్రిన్సిపల్ ఇచ్చిన మాట ప్రకారం బాలికలను అమృతసర్ నుంచి గోవాకు విమానంలో పంపించాడు.