
హైదరాబాద్ లోన ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలి దుమారానికి చెట్లు విరిగి పడ్డాయి. పలు చోట్ల కరెంటు స్థంబాలు పడిపోయాయి. రోడ్లపై చెత్తాచెదారం నిండిపోయాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, సికింద్రాబాద్,కూకట్ పల్లి, బషీర్ బాగ్, అల్వాల్, బాల్ నగర్ , ఎరియాల్లో గాలి దుమారం, రాళ్ళ వాన పడుతోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, నార్సింగ్ మున్సిపాలిటీ కోకాపేట్ వద్ద ఈదురుగాలితో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షానికి ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
Also Read:-హైదరాబాద్ సిటీలో క్యుములో నింబస్ మేఘాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం
శంషాబాద్ లో భారీగా కురుస్తున్న వర్షం ఈదురు గాలులతో కూడిన వర్షం మండలంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు భారీ వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఉక్కపోతదో ఇబ్బందులు పడుతున్నారు.పాత బస్తీ లోని పలు ప్రాంతాల్లో గాలి తో కూడిన భారీ వర్షం. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది..