Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌‌ను కొనుగోలు చేయనున్న టోరెంట్ గ్రూప్

Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌‌ను కొనుగోలు చేయనున్న టోరెంట్ గ్రూప్

అహ్మదాబాద్‌లోని భారతీయ వ్యాపార అతి పెద్ద సంస్థలలో ఒకటైన టోరెంట్ గ్రూప్ 2022 ఐపీఎల్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ (GT)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. 2021లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన CVC క్యాపిటల్ పార్టనర్స్ నుండి టోరెంట్ గుజరాత్ టైటాన్స్ లో 67% వాటాను కొనుగోలు చేస్తుందని ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో (ESPNcricinfo) నివేదించింది. ప్రస్తుతానికి CVC ద్వారా విక్రయించబడిన వాటా విలువతో సహా మరిన్ని వివరాలను నిర్ధారించలేము. లీగ్ పాలక మండలి తుది ఆమోదం పొందే ముందు ఐపీఎల్ పత్రాలను ప్రాసెస్ చేస్తోందని అర్ధమవుతుంది. 

టోరెంట్ గ్రూప్ అంటే ఏమిటి?

టోరెంట్ గ్రూప్ కంపెనీని 1959లో ఉత్తమభాయ్ నాథలాల్ మెహతా స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీని అతని కుమారులు సుధీర్,  సమీర్ నిర్వహిస్తున్నారు. గ్యాస్, ఫార్మా, విద్యుత్ ఈ గ్రూప్ ప్రధాన వ్యాపారాలు. సెప్టెంబర్ నాటికి దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ $25 బిలియన్ల భారీ స్థాయిలో ఉంది.సుధీర్ కుమారుడు జినాల్ మెహతా ఐపీఎల్ పెట్టుబడిని పర్యవేక్షిస్తారు. టొరెంట్ ఫార్మా భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటి. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. టొరెంట్ గ్రూప్ దాదాపు రూ. 41,000 కోట్ల విలువను కలిగి ఉంది. 

ALSO READ | Gautam Gambhir: టీమిండియాపై గంభీర్ పిచ్చి ప్రయోగాలు.. ఆ రెండు విషయాల్లో ఫ్యాన్స్ ఫైర్

2025 లో ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ జట్టు:
 
2022లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే అన్ని జట్లకు షాక్ ఇచ్చి హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకుంది. 2023లో ఫైనల్ కు చేరినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. గత ఏడాది కనీసం క్వాలిఫయర్స్ కు చేరుకోవడంలో విఫలమైంది. 2025 గుజరాత్ టైటాన్స్ జట్టు విషయానికి టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్, సౌతాఫ్రికా ఫాస్ట్ర బౌలర్ రబడా, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆ జట్టులో కీలక ఆటగాళ్లు.