మరో 11 మందికి గాయాలు
జకార్తా: ఇండోనేసియాలో కుండపోత వర్షం కురిసింది. దీంతో నదులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటంతో చెట్లు కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ప్రధాన వంతెనలు తెగిపోయాయి.
సెంట్రల్ జావా ప్రావిన్స్ పెకలోంగన్ రీజెన్సీ పెటుంగ్క్రియోనో గ్రామం తీవ్రంగా దెబ్బతింది. ఈ గ్రామంలో 17 మంది చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను వెలికితీశారు.