తిరుమలలో కుండపోత వర్షం : శ్రీవారి ధ్వజస్థంభం దగ్గరకు వరద నీళ్లు

తిరుమలలో కుండపోత వర్షం : శ్రీవారి ధ్వజస్థంభం దగ్గరకు వరద నీళ్లు

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం లో  భారీ వర్షం కురిసింది.. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉన్నట్టుండి.. ఒక్కసారిగా వర్షం పడడంతో భక్తులు తడిసి ముద్దయ్యారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులతో పాటు.. దర్శనం అయ్యాక బయటికి వచ్చిన భక్తులు పూర్తిగా తడిసి ఇబ్బంది పడ్డారు.కుండపోత వర్షానికి ఆలయంలోకి పెద్దఎత్తున  వరదనీరు వచ్చి చేరింది.

Also Read :- హైడ్రా, మూసీ ప్రక్షాళన మహా యజ్ఞం లాంటివి

ఈ క్రమంలో ద్వజస్థంభం దగ్గర అడుగు మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో టిటిడి సిబ్బంది నీటిని బయటికి పంపుతున్నారు. మరో వైపు లోతట్టు ప్రాంతాలు, తిరుమల రోడ్లపై వర్షపు నీరు ముంచెత్తింది. షాపులలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వస్తువులన్నీ తడిసిపోయి.. వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శనివారం కావడంతో తిరుమలలో రద్దీ కూడా ఎక్కువున్న క్రమంలో ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి భక్తజనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.