గద్వాల, వెలుగు: వానలకు రిజర్వాయర్ లోకి నీరు వస్తే తమ పరిస్థితి ఏమిటని చిన్నోనిపల్లి గ్రామ నిర్వాసితులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. 3 రోజులుగా భారీ వర్షం కురుస్తుండడంతో రిజర్వాయర్ లోకి నీరు వచ్చి చేరుతోంది. చిన్నోనిపల్లి రిజర్వాయర్ దగ్గర కుండపోత వర్షం పడితే తమ పరిస్థితి ఏమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయర్ పనులను పెండింగ్ లో పెట్టడంతో నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేయకుండా అక్కడే ఉండిపోయారు. 18 ఏండ్లు పనులు చేయకుండా, ఇప్పుడు హడావుడిగా పనులు చేస్తున్నారు. పనులు దాదాపు కంప్లీట్ కావడంతో నీళ్లు ఊర్లోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారు.