అచ్చంపేట/అలంపూర్/గండీడ్, వెలుగు : ఈదురు గాలులు, అకాల వర్షంతో అచ్చంపేట సమీపంలోని 33 కేవీ లైన్ పోల్స్ విరిగిపోవడంతో అమ్రాబాద్, అచ్చంపేట మండలం ఐనూల్ సబ్ స్టేషన్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలకు కరెంట్ సప్లై నిలిచిపోయింది. అచ్చంపేట మండలంలో ఐదు పోల్స్ విరిగినట్లు విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఉండవెల్లి మండలంలో భారీ వర్షం కురవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
బొంకూర్ గ్రామంలో రెండు విద్యుత్ స్తంభాలు, పలు కాలనీల్లో చెట్లు నేలకొరిగాయి. మానవపాడు మండలం పెద్ద పోతులపాడు, చిన్న పోతులపాడు సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇబ్బందిపడ్డారు. గండీడ్ మండలం అసిరెడ్డిపల్లి గ్రామంలో పిడుగు పడి అంజిలయ్యకు చెందిన 30 నాటు కోళ్లు చనిపోయాయి.