న్యూఢిల్లీ: తోషిబా గ్రూప్ ఇండియాలో 10 బిలియన్ జపనీస్ యెన్ (సుమారు రూ.500 కోట్ల) ను ఇన్వెస్ట్ చేయనుంది. పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన ఎక్విప్‌మెంట్ల తయారీని పెంచాలని కంపెనీ చూస్తోంది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (టీటీడీఐ) తన తయారీ సామర్ధ్యాన్ని ఒకటి న్నర రెట్లు పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.
మేకిన్ ఇండియాకు కట్టుబడి ఉన్నామని, ఇండియా నుంచి ఎగుమతులు పెంచాలని చూస్తున్నామని టీటీడీఐ ఎండీ హిరోషి ఫురుటా అన్నారు. కొత్త పెట్టుబడులతో కంపెనీ కార్యకలాపాలు మెరుగువుతాయని, ఇండియాలో, ఇతర దేశాల్లో బిజినెస్‌ను విస్తరించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఇండియన్ మార్కెట్‌లో 400కేవీ, 765కేవీ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎక్కువ డిమాండ్ ఉందని, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల టెస్టింగ్ కెపాసిటీని పెంచుతామని
వివరించారు.