IND vs BAN 2024: భారత్-బంగ్లా రెండో టెస్ట్.. టాస్‌కు వర్షం అంతరాయం

కాన్పూర్ వేదికగా జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ కు ముందు గంట వరకు వర్షము పడి ఆగిపోయింది. దీంతో పిచ్ పై కవర్లు కప్పి ఉంచారు. ప్రస్తుతం పిచ్ ను పరిశీలిస్తున్నారు. మరో అరగంటలో టాస్ వేసే అవకాశం ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగిన ప్లేయింగ్ 11 తో భారత జట్టు బరిలోకి దిగొచ్చు. మరోవైపు బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందో చూడాలి. రెండు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.   

భారత్ తుది జట్టు అంచనా:

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్/జస్ప్రీత్ బుమ్రా

బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా:

షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్/నహిద్ రానా, తైజుల్ ఇస్లాం