బిగ్ బాష్ లీగ్‌లో గందరగోళం.. ఒక మ్యాచ్‌లో రెండు సార్లు టాస్

బిగ్ బాష్ లీగ్‌లో గందరగోళం.. ఒక మ్యాచ్‌లో రెండు సార్లు టాస్

సాధారణంగా టాస్ కాయిన్ తో వేస్తారు. కానీ బిగ్ బాష్ లీగ్ దీనికి భిన్నం. ఈ మెగా లీగ్ లో బ్యాట్ తో టాస్ వేస్తారు. ఈ బ్యాట్ కు ఒక సైడ్ రూఫ్ అని మరో సైడ్ ఫ్లాట్స్ అని రాసి ఉంటుంది. మ్యాచ్ రిఫరీ బ్యాట్ పైకి విసిరివేస్తే కెప్టెన్ ఒక కెప్టెన్ తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ రోజు (డిసెంబర్ 12) మ్యాచ్ లో టాస్ సమయంలో ఒక ఫన్నీ సంఘటన జరిగింది. 

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ వేస్తుండగా బ్యాట్ ఆశ్చర్యకరంగా ఏ సైడ్ పడకుండా బ్యాట్ అంచున పడింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు పగలబడి నవ్వుకున్నారు. దీంతో టాస్ మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. బిగ్ బాష్ లీగ్ ఈ వీడియోను తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్ కెప్టెన్ క్రిస్ గ్రీన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ BBL స్టూడియోలో ఈ ఫన్నీ సంఘటన గురించి మాట్లాడుతూ.. అంచులు మందంగా లేనందున పాత రోజుల్లో అలా జరిగేది కాదు. అని వినోదభరితంగా చెప్పాడు. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో సిడ్నీ థండర్ 13 ఓవర్లలో 5 వికెట్లకు 80 పరుగులు చేసి విజయం కోసం పోరాడుతుంది.