తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 1100 దాటాయి. నిన్నటి వరకు 1096 కేసులు ఉండగా.. బుధవారం కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసులు 1107కు చేరింది. బుధవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 11 మంది కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1107కు చేరినట్లు తెలిపింది. ఈ కొత్త కేసులన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చినట్లు వెల్లడించింది. చికిత్స అనంతరం కోలుకున్న 20 మందిని బుధవారం డిశ్చార్జ్ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 648 మంది డిశ్చార్జ్ కాగా.. 29 మంది కరోనాతో మరణించినట్లు చెప్పింది. ప్రస్తుతం 430 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
అసలు కరోనా కేసులే రాని జిల్లాలు
ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో అసలు పాజిటివ్ కేసులే రాలేదు.
గడిచిన 14 రోజులుగా 22 జిల్లాల్లో కేసుల్లేవ్..
రాష్ట్రంలో గడిచిన 14 రోజులుగా 21 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ జిల్లాలివే..
- కరీంనగర్
- సిరిసిల్ల
- కామారెడ్డి
- మహబూబ్ నగర్
- మెదక్
- భూపాలపల్లి
- సంగారెడ్డి
- నాగర్ కర్నూల్
- ములుగు
- పెద్దపెల్లి
- సిద్దిపేట
- మహబూబబాద్
- మంచిర్యాల
- భద్రాద్రి
- వికారాబాద్
- నల్లగొండ
- ఆసిఫాబాద్
- ఖమ్మం
- నిజామాబాద్
- ఆదిలాబాద్
- సూర్యాపేట్
- నారాయణపేట్