తెలంగాణలో ఆదివారం కొత్తగా మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 జీఎచ్ఎంసీ పరిధిలో, 2 రంగారెడ్డి జిల్లాలో రాగా.. ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1551కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 34 మంది మరణించగా.. ఇప్పటి వరకు 992 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 525 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.
947 మంది మగవాళ్లు
రాష్ట్రంలో శనివారం వరకు చేసిన టెస్టుల్లో 947 మంది మగవాళ్లకు, 566 మంది మహిళలకు పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారి సంఖ్య పురుషుల్లో 14,256 మంది, మహిళల్లో 7619 మంది ఉన్నారని తెలిపింది. అయితే ఈ పాజిటివ్, నెగటివ్ రిజల్ట్ సంఖ్యు కలిపితే వచ్చే మొత్తం 23,388 మాత్రమే. మొత్తంగా మే 16 వరకు చేసిన టెస్టుల సంఖ్య ఇదేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ఆధారంగా తెలుస్తోంది.
వయసు వారీగా పాజిటివ్ కేసుల వివరాలు
వయసు మగవాళ్లు ఆడవాళ్లు
0 – 15 121 97
16 – 30 252 182
31 – 45 258 148
46 – 60 208 93
60ఏళ్లు పైబడినవాళ్లు 106 45