రైతులకు గుడ్ న్యూస్: ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది

రైతులకు గుడ్ న్యూస్: ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది
  • వడ్ల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం
  • పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క చెప్పారు. ములుగులోని పాల్‌‌‌‌‌‌‌‌సాబ్‌‌‌‌‌‌‌‌పల్లి రోడ్డులో పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్మించిన 1000 టన్నుల కెపాసిటీ గల గోడౌన్స్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర టీఎస్, పీఏసీఎస్​ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బానోతు రవిచందర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క మాట్లాడారు. 

రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లు, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు సమన్వయంతో వడ్లు కొనుగోలు చేయాలని సూచించారు. ములుగు ఏరియాలో ధాన్యం రావడానికి కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ ఆఫీసర్లు పకడ్బందీ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎక్కడెక్కడ గోడౌన్లు అవసరమన్న విషయాన్ని రైతులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు తెలియజేయాలన్నారు. 

ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని, చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాంల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక చొరవ చూపాలని, గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు కల్పించడంతో పాటు, పనులు అందరికీ ఉపయోగపడేలా చూసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీల జీవన ప్రమాణాలను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, డీసీవో సర్దార్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ మర్రి రాజు, రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పాల్గొన్నారు.

పాఠశాలల్లో వసతులు కల్పిస్తాం

ములుగులోని సోషల్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ బాలికల హాస్టల్‌‌‌‌‌‌‌‌ను మంత్రి సీతక్క, ఎంపీ పొరిక బలరాంనాయక్, కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌‌‌‌‌‌‌‌ సందర్శించి, స్టూడెంట్లతో సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.