4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

సీఎం కేసీఆర్‌‌కు బీసీ సంక్షేమ సంఘం లెటర్

హైదరాబాద్‌‌, వెలుగు : కరోనా వల్ల జనం ఇబ్బందిపడుతున్నందున, ప్రైవేట్‌‌ స్కూళ్లు, కాలేజీలు ఫీజులను సగం తగ్గించేలా చూడాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ డిమాండ్‌‌ చేశారు. కేవలం 4 నెలలు మాత్రమే విద్యాసంస్థలు తెరిచి ఉంచే చాన్స్‌‌ మాత్రమే ఉందన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు గురువారం లెటర్​ రాశారు. ఇప్పటికే ప్రైవేట్‌‌ స్కూళ్లు ఆన్‌‌లైన్‌‌ క్లాసులు చెబుతూ, ట్యూషన్‌‌ ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూలు చేశాయన్నారు. కరోనా కష్ట కాలంలో అప్పులు చేసి,  కొంత మంది బంగారాన్ని తాకట్టు పెట్టి ఇప్పటికే 50% ఫీజులు చెల్లించారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ