కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ ఎక్కువవుతోంది. గడిచిన 24 గంటల్లో 2487 కొత్త కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కరోనా కేసులు, మరణాలు ఇవే. ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చిన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కి చేరింది. అందులో 1306 మంది మరణించగా.. 10,887 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 28,070 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో 12 వేలు దాటిన కరోనా కేసులు
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 12296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 521 మంది మరణించగా.. 2 వేల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్ లో 5055, ఢిల్లీలో 4122 మందికి వైరస్ సోకింది. మధ్యప్రదేశ్ లో 2846, రాజస్థాన్ లో 2772, తమిళనాడులో 2757, ఉత్తరప్రదేశ్ లో 2626 మంది కరోనా బారినపడ్డారు. ఏపీలో 1583, తెలంగాణలో 1063, పశ్చిమ బెంగాల్ లో 922, పంజాబ్ లో 772, జమ్ము కశ్మీర్ లో 666 కరోనా కేసులు నమోదయ్యాయి.