దేశ వ్యాప్తంగా 154కి చేరిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా 154కి చేరిన కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది. ఇండియాలో విదేశీయులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య ఇవాళ సాయంత్రానికి 154కి చేరింది. ఇందులో విదేశీయులు 25 మంది ..129 మంది భారతీయులు. 14 మంది డిశ్చార్జ్ కాగా ముగ్గురు చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు 17 రాష్ట్రాలకు కరోనా వ్యాపించింది. ఇవాళ పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల్లో తొలి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో బుధవారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ట్రంలో మొత్తం ఆరు కరోనా కేసులు నమోదు కాగా.. ఒక వ్యక్తి పూర్తిగా నయమై డిశ్చార్జ్ అయ్యాడు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. వైరస్ విస్తరించకుండా ఆయా రాష్ట్రాలు ముందస్తుగా హై అలర్ట్ ప్రకటించాయి. విద్యాసంస్థలు, థియేటర్స్, టూరిస్ట్ స్పాట్స్, టెంపుల్స్ మూతబడ్డాయి. తాజ్ మహల్ సందర్శనను కూడా నిలిపివేశారు. అటు తమిళనాడులోని ఊటీలో టూరిస్టులు ,హోటళ్లు,రిసార్ట్స్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.