మ‌హారాష్ట్ర‌లో 2 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో 2 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజులోనే 221 మందికి వైర‌స్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1982 చేరిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలోనే అత్య‌ధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక త‌ర్వాతి స్థానంలో ఢిల్లీ, త‌మిళ‌నాడు ఉన్నాయి. ఢిల్లీలో ఆదివారం 85 మంది క‌రోనా సోక‌గా.. మొత్తం కేసుల సంఖ్య 1154కు చేరింది.

త‌మిళనాడులో 106 కొత్త కేసులు

త‌మిళ‌నాడులోనూ కొద్ది రోజుల‌గా రోజూ భారీ సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 106 కొత్త కేసులు న‌మోదు కాగా.. మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 1075కి చేరింది. ఇవాళ కొత్త‌గా పాజిటివ్ అని తేలిన 106 కేసుల్లో 16 మందికి ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి వ‌చ్చిన ట్రావెల్ హిస్ట‌రీ ఉండ‌గా.. మిగిలిన వారంతా వారి కాంటాక్ట్స్ అని తెలిపారు త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి బీలా రాజేశ్. ఆదివారం ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారని, వీరితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌వారి సంఖ్య 50కి చేరిన‌ట్లు తెలిపారామె. రాష్ట్రంలో ఇద్ద‌రు ప్ర‌భుత్వ వైద్యులు, ఇద్ద‌రు రైల్వే హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు, న‌లుగురు ప్రైవేటు ఆస్ప‌త్రుల డాక్ట‌ర్లు, ఐదుగురు న‌ర్సుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు చెప్పారు బీలా రాజేశ్.