స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు @11 కోట్లు..ఐదు నెలల్లో కోటిమంది

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు @11 కోట్లు..ఐదు నెలల్లో కోటిమంది
  • గత ఐదు నెలల్లోనే కొత్తగా కోటి మంది

న్యూఢిల్లీ:ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ దగ్గర రిజిస్టర్ చేసుకున్న మొత్తం ఇన్వెస్టర్లు 11 కోట్లను దాటారు. కేవలం ఐదు నెలల్లోనే కోటి మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ చేసుకున్నారని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ ప్రకటించింది. కరోనా సంక్షోభం తర్వాత నుంచి  స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి భారీగా ఇన్వెస్టర్లు వస్తున్నారు. 

గత మూడేళ్లలోనే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో రిజిస్టర్ చేసుకున్న యూనిక్ ఇన్వెస్టర్లు 3.6 రెట్లు పెరిగారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ 1994 లో కార్యకలాపాలు మొదలు పెట్టింది. కోటి ఇన్వెస్టర్లను సంపాదించడానికి సంస్థకు 14 ఏళ్లు పట్టింది. 

తర్వాత కోటి మందిని ఏడేళ్లలో, మరో కోటి మందిని 3.5 ఏళ్లలో సంపాదించింది.  ఆ తర్వాత కోటి ఇన్వెస్టర్లను సంపాదించడానికి ఏడాది టైమే తీసుకుంది.  ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్నారని,  సుమారు 6–7 నెలల్లో కోటి మంది కొత్త ఇన్వెస్టర్లు జాయిన్ అవుతున్నారని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 

తాజాగా ఐదు నెలల్లోనే  కోటి మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించింది. గత ఐదు నెలల్లో రోజుకి 47 వేల నుంచి 73 వేల మంది యునిక్ ఇన్వెస్టర్లు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. 

ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన పెరగడం, మార్కెట్ పెరుగుతుండడం, డిజిటైజేషన్ వంటివి ఇన్వెస్టర్లు పెరగడానికి కారణమవుతున్నాయి. కిందటేడాది నిఫ్టీ50 8.8 శాతం లాభపడగా, నిఫ్టీ500 15.2 శాతం పెరిగింది. 

గత తొమ్మిది సంవత్సరాలుగా బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు లాభాలనే ఇచ్చాయి. మొత్తం 11 కోట్ల ఇన్వెస్టర్లలో   మహారాష్ట్ర (1.8 కోట్లు),    ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1.2 కోట్లు), గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (98 లక్షలు) నుంచి  ఎక్కువ మంది ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల వాటా 36.6 శాతంగా ఉంది.