
- మెదక్ జిల్లాలో 86.69 శాతం
- సంగారెడ్డి జిల్లాలో 73.83 శాతం
- చెదరు మదురు గొడవలు
- పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు
మెదక్, వెలుగు: అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మెదక్ జిల్లాలోఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తం 80.28 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్‌లో 81.72 శాతం ఓట్లు పోలవగా, నర్సాపూర్ లో78.89 శాతం ఓట్లు పోలయ్యాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్మొదలు కాగా టెక్నికల్ఇష్యూస్తో పలుచోట్ల ఈవీఎంలు, వీవీ ప్యాట్మొరాయించడంతో పోలింగ్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.
రామాయంపేట మండలం డి.ధర్మారంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వెల్దుర్తిలో సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలు కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కొత్త ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌కేంద్రాలకు వచ్చి ఓటేశారు. ఆందోల్నియోజకవర్గ పరిధిలోని రేగోడ్ మండల కేంద్రంలో ఇండిపెండెంట్అభ్యర్థి ఆమోస్ తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ పోలింగ్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పాపన్నపేట మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే యూసుఫ్‌పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్,- బీఆర్ఎస్ వర్గాలు గొడవ పడగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఓటేసిన అభ్యర్థులు, అధికారులు
బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి రామాయంపేట మండలం కోనాపూర్‌లో, కాంగ్రెస్అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో, బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌కుమార్ మండల కేంద్రమైన నిజాంపేటలో, బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలం గోమారంలో, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మాసాయిపేట మండల కేంద్రంలో, బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ నర్సాపూర్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ రాజర్షిషా మెదక్ మున్సిపాలిటీ పరిధి ఔరంగాబాద్ లో, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ మండలం మాచవరంలో ఓటేశారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు, చిన్న చిన్న చెదురు మదురు ఘటనలు మినహా ఓవరాల్ గా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొండాపూర్ మండలంలో నాలుగైదు చోట్ల ఈవీఎంలు మొరాయించగా ఓటర్లు ఇబ్బంది పడ్డారు. నారాయణఖేడ్ సెగ్మెంట్ నాగలిగిద్ద మండలం ఉట్ పల్లి గ్రామంలో పోలింగ్ సిబ్బంది జై తెలంగాణ అని నినాదించడంతో అక్కడి ఓటర్లు వారితో గొడవకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చెక్కబెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ 73.83 శాతం నమోదైంది. జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 79.84 శాతం నమోదు కాగా సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యల్పంగా 70.01 శాతం పోలైంది.
పటాన్ చెరు నియోజకవర్గంలో 69.2 శాతం, నారాయణఖేడ్ సెగ్మెంట్లో 74.72 శాతం, ఆందోల్ నియోజకవర్గంలో 76.12శాతం ఓటింగ్ జరిగింది. అయితే ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ సాయంత్రం ఐదు గంటలలోగా పుంజుకుంది. ఇదిలా ఉంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లో లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి 9 గంటల వరకు కూడా ఆయా పోలింగ్ సెంటర్లలో ఓటర్లు బారులు తీరి కనిపించారు. జిల్లా మొత్తంగా చూస్తే మరో ఐదు శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.