సంపూర్ణ సూర్యగ్రహణం: స్పెషల్ యానిమేషన్తో గూగుల్ సెలబ్రేషన్స్

సంపూర్ణ సూర్యగ్రహణం: స్పెషల్ యానిమేషన్తో గూగుల్ సెలబ్రేషన్స్

ఇప్పుడు అందరూ సంపూర్ణ సూర్యగ్రహణం గురించే మాట్లాడుకుంటున్నారు. సూర్యగ్రహణం గురించి రకరకాల కథలు చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 8న పగటిపూట రాత్రిగా మారే సూర్యగ్రహణం గురించి అంతా చర్చించుకుంటున్నారు.సాధారణంగా సూర్యగ్రహణం1 నిమిషం..నిమిషమున్నర కంటే ఎక్కువ సమయం ఉండదు. కానీ ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం 4 నిమిషాలపాటు ఉంటుదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొత్తం గ్రహణం నాటకీయంగా ఉంటుందని.. 4నిమిషాల పాటు ఆకాశాన్ని చీకటిగా మారుస్తుందని..54 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం జరుగబోతోందని అంటున్నారు. ఇదిలా వుంటే గూగుల్ మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణాన్ని యానిమేషన్ తో చూపిస్తూ సెలబ్రేషన్స్ జరుపుతోంది. గ్రహణం కోసం వెతికే వినియోగదారులు సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళ్లే క్షణాన్ని వర్ణించే గ్రాఫిక్స్ గూగుల్ చూపిస్తుంది. 

Google  సంపూర్ణ సూర్యగ్రహణం యానిమేషన్ ను ఎలా చూడాలి 

Google  సంపూర్ణ సూర్యగ్రహణం యానిమేషన్ ను చూసేందుకు  Google. com లో  ఏప్రిల్ 8 గ్రహణం, గ్రహణం 2024, సూర్యగ్రహణ, సూర్యగ్రహణం 2024, సంపూర్ణ సూర్యగ్రహణం వంటి పదాలు శోధించడం ద్వారా ఈ అద్భుతమైన సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన గ్రాఫిక్స్ ను చూడొచ్చు. 

అసలు సూర్యగ్రహణాన్ని అంటే ఏమిటీ 

భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు భూమి ఉపరితలంపై చంద్రుని నీడ ఏర్పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా గానీ, పూర్తిగా కానీ కనిపించకుండా చేసినప్పుడు పగటిపూట ఆకాశంలో చీకటిగా మారుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు.  

సూర్యగ్రహణాన్ని ఎలా చూడాలి ..

 ఏప్రిల్ 8 న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహాన్ని చూసేందుకు నాసా ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది.మెక్సికో ,కెనడా,యునైటెడ్ స్టేట్స్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది.