హార్ట్​ఎటాక్ ​కేసుల్లో గోల్డెన్ ​అవర్ కీలకం : కారియాలజిస్ట్​ రాజేశ్​ బుర్కుండే

హార్ట్​ఎటాక్ ​కేసుల్లో గోల్డెన్ ​అవర్ కీలకం : కారియాలజిస్ట్​ రాజేశ్​ బుర్కుండే
  • ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం

మంచిర్యాల, వెలుగు: హార్ట్​ఎటాక్ కేసుల్లో గోల్డెన్​అవర్​ ఎంతో కీలకమని, ఏమాత్రం ఆలస్యమైనా పేషెంట్​ ప్రాణాలకే ప్రమాదమని మంచిర్యాల లోని టచ్​ హాస్పిటల్ ​కార్డియాలజిస్ట్​ డాక్టర్​ రాజేశ్​ బుర్కుండే అన్నారు. అవగాహన లేక ఆలస్యంగా హాస్పిటల్​కు రావడం వల్ల వారిని కాపాడడం కష్టమవుతోందన్నారు. మంగళవారం ఆయన డాక్టర్​ వికాస్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. స్ట్రోక్​వచ్చిన వారిలో 50 శాతం మంది హాస్పిటల్​కు చేరకముందే చనిపోతున్నారని, సివియర్​అటాక్​ కేసుల్లో హాస్పిటల్​కు వచ్చాక కూడా 90 శాతం మరణించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత గంటలోగా హాస్పిటల్​కు చేరితే ప్రాణాలను కాపాడే చాన్స్​ ఉంటుందన్నారు.

 
కానీ ఆలస్యమైతే గుండె కండరాలకు శాశ్వత నష్టం ఏర్పడుతుందన్నారు. ఇటీవల ఓ పేషెంట్​100 శాతం హార్ట్​ బ్లాకేజ్, బ్రెయిన్​ స్ట్రోక్​తో సకాలంలో హాస్పిటల్​కు రావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించి బ్లాకేజీని తొలగించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఛాతిలో నొప్పి వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.