హైదరాబాద్, వెలుగు: తమిళనాడులోని అరుణాచలానికి రాష్ట్ర ఆర్టీసీ ఏర్పాటు చేసిన టూర్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం కొన్ని బస్సులు బయలుదేరి వెళ్లగా, ఆదివారం వివిధ డిపోలకు చెందిన 32బస్సుల్లో 1,200 మంది భక్తులు బయల్దేరి వెళ్లారు. ఎంజీబీఎస్‌లో హైదరాబాద్ జోన్ ఈడీ పురుషోత్తం నాయక్ డీఎం కృష్ణారెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.
భక్తులకు సహాయంగా ఉండేందుకు, సమాచారం ఇచ్చేందుకు కాణిపాకం, కాట్పాడు, అరుణాచలం, వెల్లూరులో కండక్టర్లను, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజర్లను నియమించినట్లు తెలిపారు.