
- బాపూఘాట్, తారామతి, ఏకో పార్క్, ట్రెక్ పార్కుకు కనెక్టివిటీ
- రోడ్లు, ఫుడ్‌కోర్టులు, షాపింగ్ సెంటర్ల నిర్మాణం
- పీపీపీ పద్ధతిలో నిర్మించాలని హెచ్ఎండీఏ ప్లాన్
- సంస్థల నుంచి ఎక్స్‌ప్రెస్ ఆఫ్ఇంట్రెస్ట్కు ఆహ్వానం
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ వెస్ట్‌సిటీలో టూరిజం డెవలప్ చేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది. ఇందుకు ‘ వెస్ట్ హైదరాబాద్ టూరిజం సర్క్యూట్’ పేరుతో కొత్వాల్ గూడ ఎకో పార్క్, బాపూఘాట్, తారామతి –బారాదరి, చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కులను కలిపి ఒక సర్క్యూట్ కనెక్టివిటీతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
పీపీపీ (పబ్లిక్– ప్రైవేట్ – పార్ట్నర్ షిప్)పద్ధతిలో డెవలప్ చేసేందుకు సంస్థలను ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రస్ట్ కోసం ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాజెక్టును చేపట్టే సంస్థ డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్(డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో పనులు చేయాల్సి ఉంటుంది. భూముల అప్పగింత, ఇతర మౌలిక సదుపాయాల కల్పన హెచ్ఎండీఏ చూసుకుంటుంది.
టూరిజం సర్క్యూట్ ఇలా...
సిటీలోని లంగర్‌హౌస్ నుంచి తారామతి బారాదరి 3.8 కి.మీ , బాపూఘాట్నుంచి కొత్తగూడ ఏకో పార్క్13.50 కి.మీ, హిమాయత్‌సాగర్ నుంచి నార్సింగిలోని ట్రెక్ పార్క్7.5 కి.మీ , ఫారెస్ట్ ట్రెక్పార్క్ నుంచి తారామతి బారాదరి 6 కి.మీ కలిపి మొత్తం 31 కి.మీ. మేరకు రింగ్ సర్క్యూట్ గా నిర్మించనుంది. దీని వల్ల టూరిస్టులు నాలుగు ప్రాంతాలను ఈజీగా విజిట్ చేసుకునే చాన్స్ ఉంటుంది.
ఆయా రూట్లలో కొత్త రోడ్లను నిర్మించడంతో పాటు టూరిస్టులను ఆకట్టుకునేందుకు షాపింగ్సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు. రోడ్లు, షాపింగ్సెంటర్లు, ఫుడ్స్టాల్స్అన్నీ ఆకట్టుకునే రీతిలో సదరు సంస్థలే డిజైన్చేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన వ్యయాన్ని భరించడం, నిర్వహణ బాధ్యతలు చూసుకోవడం, లీజుగడువు తీరిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూములను, ఆయా నిర్మాణాలకు అనుమతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంతా హెచ్ఎండీఏ నిర్వహిస్తుంది. వరల్డ్క్లాస్ఎమినిటీస్తో, సరికొత్త కాన్సెప్టులతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయబోతున్నామని, స్టాండర్డ్ అండ్ కస్టమైజ్డ్ టూరిస్టు ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.