సూర్యాపేట, వెలుగు: సంస్కృతి సంప్రదాయాలు భావి తరాలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉండ్రుగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తి గాయత్రి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రామాల్లో సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు, గంగిరెద్దు, ఆటలు గుర్తుకు వస్తాయన్నారు.
వచ్చే సంవత్సరం దాదాపుగా వెయ్యి మంది మహిళలు పాల్గొనే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి నార్లకుంట నర్మద, రెండవ బహుమతి పోలా పద్మ, మూడవ బహుమతి జూలూరి మమత, నాలుగో ఫ్రైజ్ ఉమ గెలుపొందారు. డాక్టర్ రామ్మూర్తి యాదవ్ కుమార్తె నేహ ఆధ్వర్యంలో తయారు చేసిన నామం చీరలు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫివుల్లా, వెలుగు వెంకన్న, నామా అరుణ, శ్రీవిద్య కరుణాకర్, పటేల్ లావణ్య రమేశ్ రెడ్డి, వెలుగు సంతోషి, వాసవి క్లబ్ సభ్యులు తదితరుల పాల్గొన్నారు.