రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఎన్నారైలు చేయూతనివ్వాలి : జూపల్లి కృష్ణారావు

  • మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. లండన్​లో మూడ్రోజులపాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ కార్యక్రమంలో ఎన్నారైలతో కలిసి మంత్రి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసేలా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికే నల్లమల ప్రాంతం తల్లి లాంటిదని, ఈ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు. నల్లమల ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ఎన్నారైలు చేయూతనందించాలని..అక్కడ పెట్టుబడులు పెట్టి టూరిస్టులను ఆకర్షించేలా కృషి చేయాలని మంత్రి రిక్వెస్ట్ చేశారు