కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. బాన్సువాడలో ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభంతోపాటు రూ.52 కోట్లతో చేపట్టనున్న వాటర్ స్కీమ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
కామారెడ్డి మార్కెట్‌కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగే కార్యక్రమానికి మంత్రి హాజరుకానున్నారు.