- సాగర్ పైలాన్ కాలనీలో తవ్వకాలు
- పోలీసుల అదుపులో నిందితులు
హాలియా: గుప్త నిధుల తవ్వకాల్లో ఓ టూరిజం అధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు దుండగులు నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో ఆదివారం నుంచి తవ్వకాలు జరుపుతున్నారు. ఇంటి యజమాని హైదరాబాద్ నుంచి ముగ్గురు మంత్రగాళ్లను తీసుకొచ్చి ఈ పనులు చేయిస్తున్నారు. అయితే ఇంటి నుంచి శబ్ధాలు వస్తుండడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోలీసుల అదుపులో టూరిజం శాఖ అధికారి హరినాయక్, హరినాయక్, ఓ ఉన్నత స్థాయి అధికారి ఉన్నటు సమాచారం. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.