
హైదరాబాద్, వెలుగు: భారతదేశ పర్యాటక అభివృద్ధిలో ఒడిశా ముందంజలో ఉందని ఒడిశా పర్యాటక శాఖ మంత్రి ప్రవతి పరిడా తెలిపారు. ఒడిశా ప్రభుత్వ పర్యాటక శాఖ, భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఫిక్కీ) సంయుక్తంగా హైదరాబాద్‌లో ఒడిశా టూరిజం రోడ్‌షో నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒడిశాలో వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడం తమ లక్ష్యమని, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఈ రోడ్‌షో సాయపడుతుందని అన్నారు.