- 20 మందికి గాయాలు
- వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన
పెబ్బేరు, వెలుగు: కార్తీక మాసం సందర్భంగా దైవ దర్శనానికి వెళ్తుండగా, టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో 20 మందికి గాయాలయ్యాయి. బాధితుల వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా ఊరంపల్లి గ్రామానికి చెందిన 14 మంది, కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గ్రామానికి చెందిన 35 మంది డ్రైవర్‌తో కలిపి 50 మంది టూరిస్టు బస్సులో గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని బైపాస్‌లో నేషనల్ హైవే 44పై బస్సు అదుపు తప్పగా, డ్రైవర్అప్రమత్తమై పంట పొలాల్లోకి బస్సును మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. 20 మంది ప్రయాణికులు ప్రమాదంలో గాయపడగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 108లో తీవ్రంగా గాయపడిన వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన15 మందిని పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి
తెలిపారు.