కేరళలో పడవ ప్రమాదం..కామారెడ్డి వాసి మృతి

కేరళ పున్నమడ సరస్సులో బోట్ మునిగిన ఘటనలో కామారెడ్డి వాసి మృతి చెందాడుఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్ధానికులు కాపాడారు. స్థానిక అలప్పుజా . ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పున్నమడ సరస్సులో పార్కింగ్ చేసిన పడవకు క్రింది భాగంలో రంద్రం పడడంతో పడవలోకి నీరు చేరింది. దీంతో పడవ మునిగిపోయింది.

ఆ సమయంలో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి (55)తో పాటు ఆయన కొడుకు రాజేష్ రెడ్డి, బంధువులు నరేందర్, నరేష్, ఉద్యోగి సునందన్ పడవలో ఉన్నారు. స్థానికులు గమనించి నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే రామచంద్రారెడ్డి మృతి చెందాడు. వీరు గత నాలుగు రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. వెన్నెముక వైద్యం కోసం వెళ్లి రామచంద్రారెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొన్న కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.