తెలంగాణలో ఈ టూరిస్ట్​ ప్లేస్​లని చుట్టొద్దమా.. 

తెలంగాణలో ఈ టూరిస్ట్​ ప్లేస్​లని చుట్టొద్దమా.. 

మన తెలంగాణలో టూరిస్ట్​ ప్లేస్​లకు లోటే లేదు.  ప్రతి జిల్లాలో ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలున్నాయి. తెలంగాణ చుట్టొస్తే, రకరకాల కల్చర్లు పలకరిస్తాయి. అలాంటి టూరిస్ట్‌‌‌‌ ప్లేసెస్‌‌‌‌లో ఇవి కొన్ని.

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఖిల్లాలు

తెలంగాణ కల్చర్​కి అద్దం పట్టే చాలా కోటలు ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఉన్నాయి. వీటిలో ఎలగందుల ఖిల్లా ఒకటి. కరీంనగర్‌‌‌‌కు 16 కి.మీ. దూరంలో ఉంది. మానేరు నది ఒడ్డున, ఎత్తైన కొండపై ఉన్న ఈ కోటను చేరుకోవాలంటే దాదాపు 300 మెట్లు ఎక్కాలి. పెద్దపల్లికి దగ్గర్లో ఉన్న మరో కోట రామగిరి. శాతవాహనులు, కాకతీయుల టైంలో సైనికులు ఈ కోటలో  ఉండేవాళ్లు. ఈ కోట దగ్గర్లోనే సీతారాముల గుడి కూడా ఉంది. జగిత్యాల జిల్లాకు జగిత్యాల ఖిల్లా మరో  అట్రాక్షన్​. పదిహేడో  సెంచరీలో, అప్పటి మొఘలులు కట్టిన కోట ఇది. అటు మొఘలులు, ఇటు ఫ్రెంచ్‌‌‌‌ ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తుంది ఈ కోటలో.

వరంగల్‌‌‌‌

ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకి వేయి స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్‌‌‌‌, రామప్ప చెరువు, రామప్ప గుడి (ములుగు జిల్లా), పాకాల లేక్, అడవులు స్పెషల్​ అట్రాక్షన్​. వేయి స్తంభాల గుడి, రామప్ప టెంపుల్‌‌‌‌ శిల్పకళకు నిదర్శనం. దేశంలోని అతి పెద్ద అడవుల్లో  ఒకటైన పాకాల్‌‌‌‌, ఏటూరు నాగారం అడవుల్లో జింకలు, చిరుతలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. హైదరాబాద్‌‌‌‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రోడ్డు, ట్రైన్​లో ఇక్కడికి చేరుకోవచ్చు.

జైల్‌‌‌‌ మ్యూజియమ్‌‌‌‌

సంగారెడ్డి జిల్లాలో ఉన్న హిస్టారికల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ‘జైల్‌‌‌‌ మ్యూజియమ్‌‌‌‌’. 1796లో కట్టిన జైల్‌‌‌‌ ఇది. ఆడవాళ్ల కోసం ఒక జైలు, మగవాళ్ల కోసం మరో జైలు ఉండేది. అప్పట్లో ఖైదీల జీవితాలు ఎలా ఉండేవి.. ఎలాంటి శిక్షలు విధించేవాళ్లు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది టూరిస్టులకు ఒక డిఫరెంట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ని ఇస్తుంది. బస్సులో కానీ ట్రయిన్​లో కానీ సంగారెడ్డికి వెళ్లి ఈ మ్యూజియం చూసిరావొచ్చు.

అనంతగిరి

హైదరాబాద్‌‌‌‌ జనాలకి బాగా తెలిసిన టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ అనంతగిరి హిల్స్‌‌‌‌. తెలంగాణలోనే ట్రెక్కింగ్‌‌‌‌కు బెస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ఇది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్లేస్​. ఇక్కడ  అనంతపద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. ఈ టెంపుల్‌‌‌‌ దాదాపు 400 ఏళ్ల క్రితం కట్టినట్లు చెప్తారు. దగ్గర్లో ఒక చెరువు​, శివాలయం కూడా ఉన్నాయి. ట్రెక్కింగ్‌‌‌‌ చేయాలనుకునే వాళ్లు అనంతగిరి హిల్స్‌‌‌‌కు వెళ్లొచ్చు. హైదరాబాద్‌‌‌‌ నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండే అనంతగిరి హిల్స్‌‌‌‌ మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో చూసేయొచ్చు. ఇక్కడ బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు. లేదా వికారాబాద్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌కు చేరుకుని, అక్కడ్నుంచి బస్సులో అనంతగిరి చేరుకోవచ్చు.

ఆలంపూర్‌‌‌‌‌‌‌‌

అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటి అలంపూర్‌‌‌‌‌‌‌‌ జోగులాంబ మాత దేవాలయం. ఇది జోగులాంబ–గద్వాల్‌‌‌‌ జిల్లాలో ఉంది. ఆరో శతాబ్దంలో కట్టిన దేవాలయం ఇది. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ఈ గుడిని కచ్చితంగా ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో సంగమేశ్వర గుడితోపాటు నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనేవి నవ బ్రహ్మల రూపాలు. హైదరాబాద్‌‌‌‌ నుంచి 218 కిలోమీటర్ల దూరంలో అలంపూర్‌‌‌‌‌‌‌‌ ఉంది. రోడ్డు, ట్రైన్​  జర్నీ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

మల్లెల తీర్థం

150 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ‘మల్లెల తీర్థం’. దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. హైదరాబాద్‌‌‌‌ నుంచి 173 కి.మీ దూరంలో ఉన్న ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ఫాల్స్‌‌‌‌ వీకెండ్‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌ స్పాట్‌‌‌‌గా పాపులర్​. కృష్ణా నది నుంచి నల్లమల అడవుల మీదుగా కాలువల ద్వారా ఈ జలపాతానికి నీళ్లు వస్తుంటాయి. ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ఫాల్స్‌‌‌‌కు చేరుకోవాలంటే దాదాపు 380 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ఫాల్స్‌‌‌‌ చూసేందుకు బెస్ట్‌‌‌‌ సీజన్‌‌‌‌. రోడ్డు, రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు.

For More News..

బిట్టు శ్రీను.. లాయర్​ దంపతుల హత్య వెనుక కొత్త పేరు

ఐపీఎల్‌లో తెలుగు కుర్రాళ్లకు ఛాన్స్.. ఎవరిని ఎంతకు కొన్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న లాయర్లు..