టూరిస్ట్ సబ్ మెరైన్ మునక.. ఆరుగురు మృతి

టూరిస్ట్ సబ్ మెరైన్ మునక.. ఆరుగురు మృతి

కైరో: ఈజిప్టు ఎర్ర సముద్రంలో టూరిస్ట్ సబ్ మెరైన్ మునిగిపోవడంతో ఆరుగురు మరణించారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గురువారం హుర్ ఘడ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సింద్ బాద్ అనే టూరిస్ట్ సబ్ మెరైన్ 45 మంది రష్యన్ టూరిస్టులతో ఇక్కడి పగడపు దిబ్బల సందర్శనకు బయల్దేరింది. అరమైలు దూరం వెళ్లగానే అది మునిగిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, సబ్ మెరైన్ మునిగిపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.