ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీలో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆస్కార్ గెలవడంతో ఈ ఏనుగులు స్టార్లు అయిపోయాయి. దీంతో ఏనుగులను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. తమిళనాడులోని ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరం టూరిస్టలుతో కిటకిటలాడుతోంది.
‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీని కార్తికి గోన్సాల్వేస్ తెరకెక్కించారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్స్ ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. దీంతో ఎలిఫెంట్ విస్పర్స్ ద్వారా ఫేమస్ అయిన ఏనుగు పిల్లను చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఆస్కార్ ఏనుగును చూడటం ఆనందంగా ఉంది..
"నేను లండన్ నుండి వచ్చాను. తమిళనాడులో పర్యటిస్తున్నాం. అయితే ‘ది ఎలిఫెంట్ విస్పర్స్ ద్వారా ఫేమస్ అయిన రెండు ఏనుగులు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాయని తెలుసుకున్నాము. వాటిని చూడటం ఆనందంగా ఉంది. నేను వాటిని చూసి చాలా ఆనందించాను. ఏనుగు నాకు ఇష్టమైన జంతువు. ఈ ఏనుగులను చూడటం అదృష్టవంతులుగా ఫీలవుతున్నా...అ ని టూరిస్ట్ గ్రేస్ తెలిపారు.