
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్వద్దకు ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పర్యాటక కేంద్రంలోని జింకల పార్కు, బాతు కొలను, మ్యూజియంను చూస్తూ ఎంజాయ్ చేశారు. రిజర్వాయర్వద్ద సెల్ఫీ ఫొటోలు దిగుతూ, స్పీడ్ బోట్ షికారు చేస్తూ సందడి చేశారు.
కాగా భారీ వర్షానికి రిజర్వాయర్‌లోకి వరదనీరు చేరుతుంది. దీంతో 407 అడుగుల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 403.30 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌కు ఉన్న 12 గేట్లలో 4గేట్లను ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని కేటీపీఎస్ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు.
- పాల్వంచ రూరల్, వెలుగు