గోవాలో తగ్గిన పర్యాటకులు..ఇడ్లీ సాంబార్​..వడ పావ్ అమ్మకాలే కారణం.

గోవాలో తగ్గిన పర్యాటకులు..ఇడ్లీ సాంబార్​..వడ పావ్ అమ్మకాలే కారణం.

గోవాలో పర్యాటకులు తగ్గిపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే  మైఖేల్‌ లోబో స్పందించారు. నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో  బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబోఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.   రష్యా–ఉక్రెయిన్​ యద్దంతో పాటు గోవా బీచ్​ లో భారతీయ తినుబండారాలైన ఇడ్లీ సాంబార్​..వడ పావ్  అమ్మకాల వలన విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందన్నారు. 

 బెంగళూరు నుంచి వచ్చిన వారు  కొంతమంది గోవా బీచ్ షాపుల్లో వడా పావ్ లు అమ్ముతున్నారని.. ఇంకొంతమంది ఇడ్లీ, సాంబార్ విక్రయిస్తున్నారని.. అందువల్లే గత రెండేళ్లుగా గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని.. దీనిపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. అంతే కాకుండా రష్యా.. ఉక్రెయిన్​ యుద్దం  కారణంగా ర పర్యాటకులు గోవాకు రావడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకశాఖ.. అనుబంధ శాఖలు సమావేశం ఏర్పాటు చేసుకొని గోవాకు విదేశీ పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లోబే సూచించారు.  గతంలో USSR దేశాల నుండి వచ్చిన పర్యాటకులు గోవాను సందర్శించడం మానేశారని  ఆయన అన్నారు. 

లోకల్​ గా బీచ్​ లో నడిపే ట్యాక్సీ డ్రైవర్లకు.. క్యాబ్​ డ్రైవర్లకు మధ్య  కొన్ని  సమస్యలున్నాయని... ఆ సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే గోవా పర్యాటక రంగానికి చీకటి రోజులు వస్తాయనే విషయాన్ని గ్రహించాలని బీజేపీ ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు.పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వం మాత్రమే కారణం కాదని.. అందరూ దీనికి బాధ్యులేనని ఆయన హెచ్చరించారు.