హాలియా/నల్గొండ ఫొటోగ్రాఫర్, వెలుగు : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఓ వైపు వరద, మరో వైపు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో మొత్తం 26 గేట్లను ఎత్తి 2,67,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా గురువారం సాయంత్రం 6 గంటల వరకు 586 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌కు ఉన్న మొత్తం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి సాగర్ పరిసరాలు, బుద్ధవనం, నాగార్జునకొండ, శివాలయం, పవర్‌హౌస్ ప్రాంతాల్లో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. టూరిస్ట్‌ల రద్దీ కారణంగా ఆఫీసర్లు నాలుగు లాంచీ ట్రిప్పులను నడుపుతున్నారు.