ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ నయాగరాగా పేరున్న బొగత జలపాతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న వాగులు పొంగడంతో వాటర్ఫాల్స్కు జలకళ సంతరించుకుంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గడ్ , ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం సెలవు కావడంతో టూరిస్టులతో నిండిపోయింది. కాగా, వీరభద్రవరం గ్రామంలోని ముత్యంధార జలపాతం వద్దకు అనుమతి లేదని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అనుమతించట్లేదని సీఐ బండారి కుమార్ తెలిపారు.
- వెంకటాపురం, వెలుగు