జమ్మూకాశ్మీర్లో టూరిస్టులపై టెర్రిరిస్టుల దాడి..ఐదుగురు మృతి..8మందికి గాయాలు

జమ్మూకాశ్మీర్లో టూరిస్టులపై టెర్రిరిస్టుల దాడి..ఐదుగురు మృతి..8మందికి గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం(ఏప్రిల్ 22)  ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఐదుగురు టూరిస్టులు మృతిచెందారు. మరో 12మందికి తీవ్రంగా బుల్లెట్ గాయాలయ్యాయి.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బైసారన్ ప్రాంతంలో  ఈ దాడి జరిగింది. 

 ఇది కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకోగల గడ్డి మైదానం..మంగళవారం ఉదయం పర్యాటకుల బృందం అక్కడికి వెళ్లింది. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు పర్యాటకులపై చాలా దగ్గరగా కాల్పులు జరిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు. 

►ALSO READ | గుజరాత్ లో విమానం ప్రమాదం..జనవాసాల్లో కూలిన ప్రైవేట్ ఫ్లైట్..భయంతో పరుగులు పెట్టిన జనం

పహల్గామ్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఘటనాస్థలాన్ని సందర్శించాలని హోంమంత్రి అమిత్ ఆదేశించారు. 

పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. నేను నమ్మలేకపోతున్నాచ.. మా టూరిస్టులపై జరిగిన ఈ దాడి చాలా దారుణమైంది. ఇది అమానుష దాడి. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను Xలో పోస్ట్ చేశారు.