
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులురెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపారు. టూరిస్ట్ స్పాట్ అయినబైసారన్ ప్రాంతంతో టూరిస్టులే లక్ష్యంగా టెర్రిరిస్టులు విచక్షణారహిత కాల్పులు జరిగాపారు. ఈ కాల్పుల్లో 27 మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
A Kashmiri Muslim man helped all those people who were injured in the attack and took them to the hospital.
— Md. Arman (@MdArmanINC) April 22, 2025
While helping, he did not ask anyone's name and religion.
This is Kashmiriyat, this is Islam!#PahalgamTerrorAttack #Pahalgam #TerroristAttack #Kashmir #PahalgamAttack pic.twitter.com/jJRGXpDS7u
పహల్గా ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పౌరులే లక్ష్యంగా ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అని ఒమర్ అబ్ధుల్లా అన్నారు.ఇది ఉగ్రవాదుల పనే స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఈ ఘటన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని హోంమంత్రి అమిత్ షాకు ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో బైసారన్ టూరిస్టు ప్రాంతంలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. కాల్పుల్లో మృతిచెందిన టూరిస్టుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. కాల్పులు జరపొద్దని తమ వారిని విడిచిపెట్టాలని పలువురు టూరిస్టులు విజ్ణప్తి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.