చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు కంటెంట్ బాగుండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి. అయితే మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరోగా నటించిన అజయంతే రాండమ్ మోషణం (ARM) చిత్రం సెప్టెంబర్ 12న ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్, శివజిత్, హరీష్ ఉత్తమన్, రోహిణి, జగదీష్ మరియు అజు వర్గీస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మలయాళ ప్రముఖ దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహించగా దిబు నినాన్ థామస్ మ్యూజిక్ అందించారు.
అయితే ఏఆర్‌ఎమ్ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ తో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.103.55 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇందులో భారతదేశంలో 71.55 కోట్లు (గ్రాస్), ఓవర్సీస్ లో ఏకంగా రూ.32 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.
దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సులభంగా బ్రేక్ చేసింది. అలాగే రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఆర్. ఓ. ఐ 102% శాతం నమోదు చేసింది. దీంతో దర్శక నిర్మాతలకి లాభాల పంట పండింది. అలాగే ఈ చిత్రం రిలీజ్ అయిన 32 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళ చిత్రాల క్లబ్ లో చేరింది.
ఇండియా నెట్ - 60.64 కోట్లు
ఇండియా గ్రాస్ - 71.55 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ - 32 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 103.55 కోట్లు