- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్ ద్వారా నిధులను సమకూర్చుకోవడానికి 4 ప్రభుత్వ బ్యాంకులను అమ్మాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రైవేటైజ్ చేస్తారని సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల్లో వేలాది మంది పనిచేస్తారు. వీటిని ప్రైవేటైజ్ చేస్తే, రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఈ విషయంలో వెనకడుగు వేయకూడదని మోడీ ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నాలుగు బ్యాంకుల్లో రెండింటిని 2021–2022 ఆర్థిక సంవత్సరంలోనే అమ్మేస్తారు. సెంట్రల్ బ్యాంక్ వంటి మిడ్సైజ్డ్ బ్యాంకుల అమ్మకం ప్రయోగం సక్సెస్ అయితే పెద్ద బ్యాంకులనూ ప్రైవేటైజ్ చేయవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే స్టేట్ బ్యాంకులో మాత్రం మెజారిటీ వాటా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కరోనా వల్ల ఎకానమీ తీవ్రంగా దెబ్బతిన్నందున, ఇలాంటి భారీ మార్పులకు ప్రభుత్వం రెడీ కావాల్సిందేనని ఎకనమిస్టులు అంటున్నారు. ప్రభుత్వ బ్యాంకులకు మొండిబకాయిలు గుదిబండగా మారాయి. బ్యాంకింగ్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేల మంది, సెంట్రల్ బ్యాంకులో 33 వేల మంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 26 వేల మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది పనిచేస్తున్నారు. ప్రైవేటైజేషన్ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి.
For More News..
ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్.. రాహుల్ @ 2
సరదాగా ‘ఫేక్ ఇగ్లూ’ యాడ్ ఇస్తే.. దిమ్మతిరిగింది