ఒక్కొక్కటిగా బయటపడుతున్నా .. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మాయాజాలం

ఒక్కొక్కటిగా బయటపడుతున్నా .. టౌన్  ప్లానింగ్  ఆఫీసర్ల మాయాజాలం

గద్వాల, వెలుగు: మున్సిపల్  ఆఫీసులో టౌన్  ప్లానింగ్  ఆఫీసర్ల మాయాజాలం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిక్రియేషన్  జోన్ లోని ల్యాండ్ కు బై నంబర్లు ఇచ్చి బురిడీ కొట్టిస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారం రోడ్డు ఏరియాలోని రిక్రియేషన్ జోన్ లో అక్రమంగా వెంచర్లు వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సర్వే నంబర్  489లో 5 ఎకరాలకు పైగా ఉన్న పొలంలో వెంచర్  చేయడానికి వీలులేదు. కానీ, టౌన్  ప్లానింగ్  ఆఫీసర్  ఎకరా భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్  చేసేసి, ఆ సర్వే నంబర్ కు 489/ బి2/ 2/1,489/బి2/2/2 వేర్వేరుగా నంబర్లు ఇచ్చేశారు. 

అవి రిక్రియేషన్ జోన్ లో లేవని చెబుతూ ఆన్ లైన్ లో వచ్చిన అప్లికేషన్ ను అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి కమిషనర్ కు ఫార్వర్డ్  చేశారు. అక్కడి నుంచి అడిషనల్  కలెక్టర్ కు ఫార్వర్డ్  చేసి అనుమతి పొందారు. కమిషనర్ తో పాటు అడిషనల్  కలెక్టర్ ను ఇందులో ఇరికించారని అంటున్నారు. ఈ విషయంపై రెండు రోజుల కింద జరిగిన మున్సిపల్  మీటింగ్ లో రగడ జరిగింది. దీనిపై విచారణ చేపడతామని కమిషనర్, చైర్మన్  హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.